అధిక శబ్దంతో డీజే నిర్వహణ.. కేసు నమోదు, పరికరాలు సీజ్
కోనరావుపేట సెప్టెంబర్ 25 (విజయక్రాంతి):అనుమతులు లేకుండా అధిక శబ్దంతో డీజే నిర్వహిస్తూ ప్రజలకు, వాహనాల రాకపోకలకు ఇబ్బంది కలిగిస్తున్న ఘటనపై కోనరావుపేట పోలీసులు చర్యలు చేపట్టారు. శుక్రవారం సాయంత్రం సుమారు 3 గంటల సమయంలో డీజే సౌండ్‌పై సమాచారం అందడంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు.
అనుమతులు లేకుండా నిబంధనలకు విరుద్ధంగా అధిక శబ్దంతో డీజే నిర్వహిస్తున్నట్లు గుర్తించిన పోలీసులు వెంటనే సౌండ్‌ను నిలిపివేశారు. అనంతరం డీజే పరికరాలతో పాటు టాటా ఏసి వాహనం (AP 29 TA 6445)ను స్వాధీనం చేసుకున్నారు.డీజే ఆపరేటర్, నిర్వాహకులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా అధిక శబ్దంతో డీజేలు నిర్వహించి ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.వినాయక నిమజ్జన కార్యక్రమాలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు.