పేద కుటుంబాలకు రేషన్ కార్డు భరోసా

25-09-2026 | 07:29pm

ప్రభుత్వ బీర్ల ఐలయ్య... యాదగిరిగుట్ట మున్సిపాలిటీలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ ....

యాదగిరిగుట్ట, సెప్టెంబర్ 25 (విజయక్రాంతి): పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఆహార భద్రత కల్పించడంతో పాటు ప్రభుత్వ సంక్షేమ పథకాలను(Government welfare schemes) అందించడంలో రేషన్ కార్డులు ఎంతో కీలకమని ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య(Government Whip Beerla Ilaiah) అన్నారు. శుక్రవారం యాదగిరిగుట్ట మున్సిపాలిటీ పరిధిలోని శ్రీ లక్ష్మీ నరసింహ ఫంక్షన్ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న నూతన స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య పాల్గొని అర్హులైన లబ్ధిదారులకు నూతన స్మార్ట్ రేషన్ కార్డులను అందజేశారు.ఈ సందర్భంగా బీర్ల ఐలయ్య  మాట్లాడుతూ  రేషన్ కార్డు కేవలం నిత్యావసర సరుకులు పొందేందుకు మాత్రమే కాకుండా, పేద కుటుంబాలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలకు అర్హత కల్పించే ముఖ్యమైన గుర్తింపు పత్రంగా ఉపయోగపడుతుందని తెలిపారు. రేషన్ కార్డు చేతిలో ఉంటే పేద కుటుంబాలకు ప్రభుత్వం తమ వెంట ఉందనే నమ్మకం, భరోసా కలుగుతుందని అన్నారు.

రాష్ట్రంలో ప్రభుత్వం 1.06 కోట్ల స్మార్ట్ రేషన్ కార్డుల ద్వారా 3.42 కోట్ల మందికి ఆహార భద్రత యూనిట్లను అందిస్తోందని తెలిపారు. అర్హులైన ప్రజలకు మరింత విస్తృతంగా ఆహార భద్రత కల్పించే దిశగా ప్రభుత్వం చర్యలు చేపడుతోందన్నారు. రాష్ట్రంలో 15 లక్షల కొత్త రేషన్ కార్డులను మంజూరు చేయడంతో పాటు, 62 లక్షల మందికి ఆహార భద్రత కార్డుల ద్వారా ప్రయోజనం కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు.

మహిళల సంక్షేమానికి ప్రజా ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని బీర్ల ఐలయ్య తెలిపారు. మహిళలకు ఆర్థిక, సామాజిక భద్రత కల్పించేందుకు ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ కార్యక్రమాలను ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో యాదగిరిగుట్ట మున్సిపల్ చైర్మన్ గుండ్లపల్లి వాణి భరత్ గౌడ్, వైస్ చైర్మన్ బరిగే రమ్య రామచందర్, కౌన్సిలర్లు  అధికారులు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు