సబ్ కలెక్టర్ ను కలిసిన ఎంపిడీఓలు

25-09-2026 | 06:50pm

భూపాలపల్లి టౌన్, సెప్టెంబర్ 25 ( విజయ క్రాంతి ) : కాటారం సబ్ కలెక్టర్ సౌరవ్ శర్మను(Kataram Sub-Collector Saurav Sharma) కాటారం, మల్హర్, పలిమెల, మహముత్తారం మండలాల ఎంపీడీఓలు శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారు సబ్ కలెక్టర్‌కు పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ మండలాల్లో కొనసాగుతున్న అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాల అమలు, పంచాయతీ రాజ్ శాఖ ద్వారా ప్రజలకు అందుతున్న సేవలపై ఎంపిడీఓలతో చర్చించారు. ప్రభుత్వ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికి చేరేలా, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు సమన్వయంతో పనిచేయాలని సబ్ కలెక్టర్ సూచించారు. ఈ కార్యక్రమంలో ఆయా మండలాల ఎంపిడీఓలు బాబు, నిశాంత్, క్రాంతి, పవన్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు