కార్నియా శస్త్రచికిత్సలపై ప్రత్యేక శిక్షణ

06-11-2026 | 05:00am

తెలంగాణ ఆప్తాల్మాలజికల్ సొసైటీ ఆధ్వర్యంలో.. 

హైదరాబాద్, నవంబర్ 5 (విజయక్రాంతి): కార్నియా మార్పిడి, ఆధునిక నేత్ర శస్త్రచికిత్స విధానాలపై యువ వైద్యులకు శిక్షణ అందించేందుకు మాదాపూర్‌లోని మెడికవర్ హాస్పిటల్స్(Medicover Hospitals), హైటెక్ సిటీ రోబోటిక్స్ సెంటర్‌లో తెలంగాణ ఆప్తాల్మాలజికల్ సొసైటీ ఆధ్వర్యంలో ఏఐఓఎస్ ప్రయోగశాల కనెక్ట్ కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఇందులో డీఎస్‌ఈకే, డీఎంఈకే, డీఏఎల్కే, ఎస్‌ఎల్‌ఈటీ వంటి ఆధునిక కార్నియా శస్త్రచికిత్స విధానాలపై శిక్షణ ఇచ్చారు. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి 44 మంది రిజిస్టర్ చేసుకున్న అభ్యర్థులతో పాటు మొత్తం 72 మంది వైద్యులు, ప్రతినిధులు పాల్గొన్నారు. తెలంగాణ, కేరళ, కర్ణాటక, మహారాష్ట్ర నుంచి నేత్ర వైద్యులు హాజరయ్యారు. ఢిల్లీలోని ఎయిమ్స్, బారక్‌పూర్‌లోని దిశా ఐ హాస్పిటల్, బెంగళూరులోని అపోలో హాస్పిటల్స్, హైదరాబాద్‌లోని ఎల్వీ ప్రసాద్ ఐ ఇనిస్టిట్యూట్‌కు చెందిన జాతీయ స్థాయి నిపుణులు శిక్షణ ఇచ్చారు.

కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డాక్టర్ ఎం. సుబ్రమణ్యం, ప్రొఫెసర్ వై. రామన్, డాక్టర్ ఏ.ఆర్. కృష్ణ ప్రసాద్ హాజరయ్యారు. మెడికవర్ హాస్పిటల్స్ సీనియర్ కన్సల్టెంట్, కార్నియా అండ్ ఆక్యులర్ సర్ఫేస్ సర్వీసెస్ విభాగానికి చెందిన డాక్టర్ చారుత జె. పురాణిక్ ప్రోగ్రామ్ డైరెక్టర్గా వ్యవహరించారు. ఏఐఓఎస్ గౌరవ ప్రధాన కార్యదర్శి డాక్టర్ సంతోష్ జి. హోనవర్ ఆలోచనతో ఈ కార్యక్రమం రూపుదిద్దుకుంది. శిక్షణలో భాగంగా మాస్టర్ క్లాసులు, శస్త్రచికిత్సల ప్రత్యక్ష ప్రదర్శనలు, చర్చలు, వెట్ ల్యాబ్లో ప్రాక్టికల్ శిక్షణ నిర్వహించారు. 

మరిన్ని వార్తలు