రెవెన్యూ పెంపునకు సర్కార్ కార్యాచరణ
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఆదాయాన్ని పెంచేందుకు ప్రభుత్వం కొత్త కార్యాచరణపై దృష్టి సారించింది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క(Deputy CM Bhatti Vikramarka) అధ్యక్షతన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో ఆదాయ వనరుల సమీకరణ మంత్రివర్గ ఉపసంఘం(Telangana Cabinet Sub-Committee) సమావేశమైంది. మంత్రులు శ్రీధర్ బాబు, జూపల్లి కృష్ణారావు పాల్గొన్నారు.
రాష్ట్ర ఆదాయ సమీకరణ (Revenue Generation) వేగవంతం చేసి, నిర్ణీత గడువులో ఆదాయ లక్ష్యాలు చేరుకోవాలని భట్టి సూచించారు. ల్యాండ్ పూలింగ్, పారిశ్రామిక భూముల క్రమబద్ధీకరణ, ప్రభుత్వ ఆస్తుల సమర్థ వినియోగంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని చెప్పారు. పెండింగ్ దరఖాస్తుల పరిష్కారానికి Weekly Targets విధించాలని, పారదర్శక విధానాలతో ఆదాయం పెంచాలని అధికారులకు సూచించారు.