ప్రొఫెసర్ల వేధింపులు.. ఇంజినీరింగ్ విద్యార్థిని బలి
రంగారెడ్డి: మొయినాబాద్(Moinabad)లోని ఓ ఇంజినీరింగ్ కళాశాలలో విద్యార్థిని వైష్ణవి(Vaishnavi) ఆత్మహత్య చేసుకోవడం తీవ్ర కలకలం రేపింది. కళాశాలలో చదువుతున్న ఆమె స్వగ్రామంలో ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. ప్రొఫెసర్ల వేధింపులే ఆమె ఆత్మహత్యకు కారణమని తోటి విద్యార్థులు ఆరోపిస్తున్నారు.
వెంకట్ రెడ్డి, ఉపేందర్ అనే ఇద్దరు ప్రొఫెసర్లు(Professors) వైష్ణవిని వేధించారని ఆరోపిస్తూ విద్యార్థులు కళాశాల ప్రిన్సిపల్‌తో పాటు సంబంధిత అధ్యాపకులను నిలదీశారు. దీంతో కళాశాల ప్రాంగణంలో ఉద్రిక్తత నెలకొంది. పరిస్థితి అదుపు తప్పకుండా యాజమాన్యం విద్యార్థులను బస్సుల్లో బయటకు పంపించి కళాశాలకు సెలవు ప్రకటించింది.
వైష్ణవి మృతిపై సమగ్ర విచారణ జరిపి, ఘటనకు బాధ్యులుగా తేలిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు