కుసుమ పంట సాగుపై అవగాహనా సదస్సు
కన్నాయిగూడెం,(విజయక్రాంతి): శుక్రవారం రోజున తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం, ములుగు ఆధ్వర్యంలో కన్నాయిగూడెం రైతు వేదిక లో "కుసుమ పంట సాగు(Cultivation of Safflower Crop)పై రైతు కార్యక్రమం" నిర్వహించారు. ఇందులో భాగంగా డాక్టర్ ఆర్. విశ్వతేజ, శాస్త్రవేత్త & కోఆర్డినేటర్, మాట్లాడుతూ... ప్రస్తుత ఎల్ నినో పరిస్థితుల్లో(El Nino) రైతులు వరి కాకుండా వర్షాధార పంటలు వేయాలని, రైతులు తక్కువ నీటితో పండే నూనెగింజ అయిన "కుసుమ" పంటను సాగు చేసుకోవచ్చని, రెండు నుంచి మూడు తడులు ఇస్తే సరిపోతుంది అని తెలిపారు.
ఈ సందర్భంగా తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం, ములుగు వారు గిరిజన ఉప ప్రణాళికలో భాగంగా అధిక దిగుబడిని ఇచ్చే "కుసుమ ( ఐఎస్ ఆఫ్ 764)" విత్తనాన్ని 40 మంది గిరిజన రైతులకు ఉచితంగా పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో ములుగు మార్కెట్ కమిటీ చైర్మన్ రేగా కళ్యాణి,వేణు గోపాల్ ఏడీఏ ఏటూరునాగారం, ముంజ మహేష్ కన్నాయిగూడెం మండల వ్యవసాయశాఖ అధికారి మరియు ఏఈఓ తో పాటు గిరిజన రైతులు పాల్గొన్నారు.