ఎమ్మెల్సీకి డీప్‌ఫేక్ బెదిరింపులు
హైదరాబాద్: టెక్నాలజీని అడ్డుపెట్టుకుని నేరాలకు పాల్పడుతున్న ముఠాల ఆగడాలు ఆందోళన కలిగిస్తున్నాయి. మార్ఫింగ్ ఫొటోలు, AI Deepfake వీడియోలతో ఓ ఎమ్మెల్సీని టార్గెట్ చేసి భారీగా డబ్బులు వసూలు చేసేందుకు ప్రయత్నించిన ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. సోషల్ మీడియాలో పరువు తీస్తామని, ప్రాణహాని తలపెడతామని బెదిరిస్తూ కోట్ల రూపాయలు డిమాండ్ చేసిన నిందితుల ఆటకు నార్సింగి పోలీసులు చెక్ పెట్టారు. ఈ కేసులో ఫాతిమా బేగంతో పాటు ఆరుగురిని అరెస్ట్ చేశారు.
ఎమ్మెల్సీ మీర్జా రహమత్ బేగ్(MLC Mirza Rahmath Baig)ను లక్ష్యంగా చేసుకున్న ఓ ముఠా పక్కా ప్లాన్‌తో బెదిరింపులకు దిగినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. ఆయనకు సంబంధించిన మార్ఫింగ్ ఫొటోలు, Deepfake Videos సోషల్ మీడియాలో ప్రచారం చేస్తామని హెచ్చరించినట్లు సమాచారం. అంతేకాకుండా వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగిస్తామని, ప్రాణాలకు ముప్పు కలిగిస్తామని బెదిరించి డబ్బులు డిమాండ్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.
తొలుత ఈ ముఠా ఏకంగా రూ.5 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేసింది. బెదిరింపులకు గురిచేసి ఇప్పటికే రూ.5 లక్షలు వసూలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. మరో రూ.5 లక్షలు చెల్లించాలంటూ ఒత్తిడి తీసుకొచ్చినట్లు వెల్లడైంది.
ఇబ్రహీంబాగ్‌లోని ఎమ్మెల్సీ కార్యాలయం వద్ద మరోసారి డబ్బులు తీసుకునేందుకు నిందితులు వచ్చినట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో అప్రమత్తమైన నార్సింగి పోలీసులు(Narsingi Police) పక్కా వ్యూహంతో అక్కడ నిఘా పెట్టారు. నగదు లావాదేవీ జరుగుతున్న సమయంలో ఆకస్మికంగా దాడి చేసి ఫాతిమా బేగంతో పాటు ఆరుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.
అరెస్టయిన వారి నుంచి రూ.4.70 లక్షల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అలాగే రెండు ఆటోలు, పలు సెల్‌ఫోన్లు, ఒక ల్యాప్‌టాప్‌ను సీజ్ చేశారు. ఈ Digital Blackmail వ్యవహారంలో మరికొందరి ప్రమేయం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.
ఈ కేసులో ఏ-1, ఏ-4 నుంచి ఏ-9, ఏ-14 నిందితులతో పాటు మరికొందరు పరారీలో ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. వారి కోసం ప్రత్యేకంగా గాలింపు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. Deepfake Technologyని ఉపయోగించి బెదిరింపులకు పాల్పడిన ఈ వ్యవహారంపై పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. డిజిటల్ ఆధారాలను పరిశీలిస్తూ ఈ ముఠా వెనుక ఉన్న ఇతర వ్యక్తుల వివరాలను సేకరిస్తున్నారు.