తప్పిపోయిన వృద్ధురాలిని కుటుంబసభ్యులకు అప్పగింత
06-11-2026 | 10:40pm
కరీంనగర్ క్రైం, నవంబర్ 6 (విజయక్రాంతి): కరీంనగర్ టౌన్(Karimnagar Town) లోని కోతిరాంపూర్‌కు తన కుమార్తె ఇంటికి వచ్చిన దాసరి చిలుకమ్మ(Dasari Chilukamma) ( 63) 05వతేది గురువారం మధ్యాహ్నం ఇంటి నుండి బయటకు వెళ్లి తప్పిపోయింది. కరీంనగర్ టూటౌన్ పోలీస్ స్టేషన్‌కు(Karimnagar Two-Town Police Station) చెందిన బ్లూకోల్ట్స్ సిబ్బంది(BlueColts Staff) గస్తీ నిర్వహిస్తుండగా శుక్రవారం సాయంత్రం మంకమ్మతోట ప్రాంతంలో వృద్ధురాలిని గుర్తించారు. ఆమె వివరాలు తెలుసుకొని క్షేమంగా ఆమెను ఆమె కుటుంబ సభ్యులకు అప్పగించారు.