ఐవీఎఫ్ కేంద్రాలకు సర్కార్ షాక్
06-11-2026 | 07:40pm
హైదరాబాద్: తెలంగాణలో అక్రమాలకు పాల్పడుతున్న ఐవీఎఫ్ కేంద్రాల(IVF Centres)పై ప్రభుత్వం కఠిన చర్యలకు సిద్ధమైంది. నిబంధనలు ఉల్లంఘించే కేంద్రాల Registrations శాశ్వతంగా రద్దు చేయాలని నిర్ణయించింది. అక్రమ అండాల సేకరణ ముఠాలతో సంబంధాలున్న సెంటర్లపై ప్రత్యేక నిఘా పెట్టనుంది. ఈ వ్యవహారాల్లో భాగస్వాములైన వైద్యుల Medical Licenses రద్దు చేసేందుకు కూడా చర్యలు చేపట్టనుంది. ఈ నిర్ణయంతో అక్రమంగా కార్యకలాపాలు సాగిస్తున్న IVF కేంద్రాల్లో కలకలం మొదలైంది.