భార్యను హతమార్చిన ఏఆర్ కానిస్టేబుల్

06-11-2026 | 11:13pm

భద్రాచలం గోదావరిలో మూట కట్టి వేసిన వైనం

భద్రాద్రి కొత్తగూడెం,(విజయక్రాంతి): ప్రేమించే పెళ్లి చేసుకున్న మహిళను ఏఆర్ కానిస్టేబుల్ హత్య(AR Constable Murder) చేసి గోదావరిలో(Godavari River) పడేసిన సంఘటన శుక్రవారం జిల్లా వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. టేకులపల్లి కి చెందిన నరేందర్ సోషల్ మీడియాలో పరిచయమైన భవానిని రెండు సంవత్సరాల క్రితం వివాహం చేసుకున్నాడు. భార్యాభర్తలిద్దరూ మూడవ టౌన్ పరిధిలోని ప్రగతి నగర్ లో నివాసం ఉంటున్నారు.

కలకాలం కలిసి ఉంటామని నమ్మి వచ్చిన యువతిని కానిస్టేబుల్ నరేందర్ అత్యంత దారుణంగా హత్య చేసి సంచిలో కట్టి గోదావరిలో పడేసి రెండు రోజుల క్రితం మూడవ టౌన్ పోలీస్ స్టేషన్లో తన భార్య కనిపించడం ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టి బూర్గంపాడు సమీపంలోని కొమ్మూరు ఇసుక ర్యాంపు వద్ద గోదావరిలో భవాని శవాన్ని గుర్తించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.

మరిన్ని వార్తలు