విద్యార్థులు అన్ని రంగాల్లో రాణించాలి
•కస్తూర్బా బాలికల వసతి గృహంలో ఆర్వో వాటర్ ప్లాంట్ ప్రారంభించిన ఎంపీ రఘునందన్ రావు
నర్సాపూర్, నవంబర్ 6: విద్యార్థులు(Students) విద్యతోపాటు క్రీడలు, ఇతర రంగాల్లోనూ రాణించాలని మెదక్ ఎంపీ రఘునందన్ రావు(MP Raghunandan Rao) సూచించారు. శుక్రవారం నర్సాపూర్ మండలం(Narsapur Mandal) చిప్పల్తూర్తి గ్రామంలోని కస్తూర్బా గాంధీ బాలికల వసతి గృహంలో హెట్రో పరిశ్రమ సహకారంతో ఏర్పాటు చేసిన ఆర్వో నీటి శుద్ధి ప్లాంట్ను బీజేపీ జిల్లా అధ్యక్షుడు వాల్దాస్ మల్లేష్ గౌడ్ ఆధ్వర్యంలో ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ విద్యార్థులు ప్రతిరోజూ యోగా చేయడంతోపాటు వివిధ క్రీడా పోటీల్లో పాల్గొనాలని, క్రీడలు శారీరక, మానసిక వికాసానికి దోహదపడతాయని పేర్కొన్నారు. వసతి గృహంలో కోతుల సమస్య తీవ్రంగా ఉందని ఉపాధ్యాయులు ఎంపీ దృష్టికి తీసుకురాగా, స్పందించిన ఆయన కళాశాల చుట్టూ సౌర విద్యుత్ కంచె ఏర్పాటు చేయిస్తామని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో ఎంపీడీవో భారతి, సర్పంచ్ సుధాకర్, ప్రిన్సిపల్ శ్వేత, హెట్రో పరిశ్రమ జనరల్ మేనేజర్ సుధాకర్, బీజేపీ జిల్లా కోశాధికారి ఆంజనేయులు గౌడ్, ఓబీసీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడు రమేష్ గౌడ్, ఎస్టీ మోర్చా జిల్లా అధ్యక్షుడు రాములు నాయక్, నాయకులు ప్రేమ్ కుమార్ యాదవ్, నాగేష్, లక్ష్మణ్ గౌడ్, భాస్కర్, కృష్ణ, ఉపాధ్యాయులు, విద్యార్థినులు పాల్గొన్నారు.