కోడి పందేల స్థావరంపై పోలీసుల దాడి
11 మంది పందెం రాయుళ్లు అదుపులోకి
రూ.9,400 నగదు, 4 కోడి పుంజులు స్వాధీనం
కన్నాయిగూడెం, నవంబర్ 06 (విజయక్రాంతి) : ములుగు జిల్లా(Mulugu District) కన్నాయిగూడెం మండలం తుపాకులగూడెం గ్రామపంచాయతీ(Tupakulagudem Gram Panchayat) పరిధిలోని దేవాదుల పంప్‌హౌస్(Devadula Pumphouse) సమీప అటవీ ప్రాంతంలో నిర్వహిస్తున్న కోడి పందేలపై పోలీసులు దాడులు నిర్వహించారు.కోడి పందేలు నిర్వహిస్తున్నారనే నమ్మదగిన సమాచారం మేరకు కన్నాయిగూడెం ఎస్ఐ పుట్ట సతీష్ ఆధ్వర్యంలో పోలీసు బృందం ఆకస్మికంగా దాడి చేసింది. ఈ దాడుల్లో 11 మంది పందెం రాయుళ్లను అదుపులోకి తీసుకుని, వారి వద్ద నుంచి రూ.9,400 నగదు, నాలుగు కోడి పుంజులను స్వాధీనం చేసుకుని కేసులు నమోదు చేసినట్లు ఎస్ఐ పుట్ట సతీష్ తెలిపారు.
చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే ఉపేక్షించేది లేదని, అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్ఐ హెచ్చరించారు.