'సమ్మర్ హాలిడేస్' మూవీ రివ్యూ

06-11-2026 | 11:54am

అమ్మమ్మ ఊరికి తీసుకెళ్లిన కథ.. మనసు దోచిన ‘సమ్మర్ హాలిడేస్’!

బాల్యం, పల్లెటూరి జ్ఞాపకాలు, కుటుంబ అనుబంధాలను కలిపి తెరకెక్కించిన చిత్రం ‘సమ్మర్ హాలిడేస్’. 90’s సిరీస్‌తో గుర్తింపు తెచ్చుకున్న మాస్టర్ రోహన్, జాతీయ అవార్డు అందుకున్న మాస్టర్ అరుణ్ ప్రధాన పాత్రల్లో నటించారు. శ్రీకర్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ఆలస్యాల తర్వాత ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ Summer Entertainer ఎంతవరకు ఆకట్టుకుందంటే..

కథేంటి?

చదువు తప్ప మరో ప్రపంచం లేదనుకునే తండ్రి ఒత్తిడితో ఇబ్బంది పడే RV (అరుణ్).. పరీక్షల్లో ఆశించిన Rank సాధించలేకపోతాడు. దీంతో తల్లి అతడిని వేసవి సెలవులకు అమ్మమ్మ ఊరికి తీసుకెళ్తుంది. అక్కడ మామిడి తోటలో పనిచేసే KV (రోహన్) పరిచయమవుతాడు. ఈ పరిచయం RV జీవితంలో ఎలాంటి మార్పు తీసుకొచ్చింది? KV గతం ఏమిటి? అన్నదే మిగతా కథ.

నటీనటుల పెర్ఫార్మెన్స్

అరుణ్ అమాయకమైన విద్యార్థి పాత్రలో సహజంగా నటించాడు. చదువు ఒత్తిడి, భావోద్వేగాలను చక్కగా పలికించాడు. రోహన్ తన ఎనర్జీ, Comedy Timingతో పాటు Emotional Scenesలోనూ ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా తల్లితో వచ్చే సన్నివేశాలు హృదయానికి హత్తుకుంటాయి. హర్షవర్ధన్, వాసుకి, జయసుధ, రాజీవ్ కనకాల తమ పాత్రలకు న్యాయం చేశారు.

టెక్నికల్‌గా ఎలా ఉంది?

దర్శకుడు శ్రీకర్ కథను పల్లెటూరి నేపథ్యంలో అందంగా నడిపించాడు. మామిడి తోటలు, కాలువల్లో ఆటలు, అమ్మమ్మ ఇంటి వాతావరణం వంటి Nostalgic Elements ప్రేక్షకులకు పాత జ్ఞాపకాలను గుర్తుచేస్తాయి. కొన్ని Emotional Scenes బాగా వర్కౌట్ అయ్యాయి. సెకండాఫ్‌లో జయసుధ, రాజీవ్ కనకాల సన్నివేశం, హనుమాన్ ఎపిసోడ్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. అయితే ఇంటర్వెల్ సాధారణంగా సాగడం, క్లైమాక్స్‌లో బలమైన Conflict లేకపోవడం, కొన్ని సన్నివేశాల్లో Logic మిస్ కావడం మైనస్‌లు. హర్షవర్ధన్ పాత్రలో మార్పు కూడా మరింత బలంగా చూపించి ఉంటే బాగుండేది. సింజిత్ సంగీతం, గోదావరి Slang సినిమాకు ప్లస్ పాయింట్లు. రెండు గంటల Runtime కూడా కథకు కలిసొచ్చింది.

ఫైనల్‌గా: లోపాలు ఉన్నప్పటికీ బాల్య జ్ఞాపకాలు, కుటుంబ అనుబంధాలు, పల్లెటూరి అందాలతో సాగే ఒక Feel-good సినిమా ‘సమ్మర్ హాలిడేస్’. భారీ మలుపులు, వేగవంతమైన కథనం ఆశించకుండా వెళ్తే మంచి అనుభూతిని ఇస్తుంది.

రేటింగ్: 2.75/5

మరిన్ని వార్తలు