ఇకపై ప్రతి ఇంటికీ నెట్

06-11-2026 | 09:39pm

హైదరాబాద్: తెలంగాణలో ప్రతి ఇంటికీ వేగవంతమైన Internet అందించేందుకు భారీ ప్రాజెక్టుకు అడుగులు పడ్డాయి. కేంద్ర ప్రభుత్వ అమెండెడ్ భారత్ నెట్ ప్రోగ్రామ్(Amended Bharat Net Programme) కింద రాష్ట్రానికి రూ.3,185 కోట్ల నిధులు సమకూరనున్నాయి. ఈ మేరకు ఢిల్లీలోని సంచార్ భవన్‌లో కేంద్రంతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. రాష్ట్రం తరఫున ఐఏఎస్ అధికారి అనుదీప్ దురిశెట్టి ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. 

ఈ ప్రాజెక్టులో భాగంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో తెలంగాణ రాష్ట్ర రూరల్ ఇంటర్నెట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్(TRRIIC) ఏర్పాటు చేయనున్నారు. టీ-ఫైబర్ ఎండీ పన్నీరు వేణు ప్రసాద్ ఈ సంస్థకు సీఈఓగా వ్యవహరించనున్నారు. T-Fiber, TRRIIC సంయుక్తంగా గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని ప్రతి ఇంటికీ హైస్పీడ్ ఇంటర్నెట్(Internet) సేవలు అందించేలా ప్రణాళిక రూపొందించాయి. ఈ ప్రాజెక్టు పూర్తయితే తెలంగాణలో డిజిటల్ అనుసంధానం(Digital Connectivity) మరింత బలోపేతం కానుంది.

మరిన్ని వార్తలు