జిల్లా స్థాయి వ్యాసరచన పోటీలకు ఏకశ్రీ ఎంపిక
నేరేడుచర్ల,నవంబర్ 10(విజయక్రాంతి): వ్యాసరచన పోటీల్లో(Essay Writing Competition) ప్రభుత్వ జూనియర్ కళాశాల(Government Junior College) విద్యార్థిని ఏకశ్రీ జిల్లా స్థాయికి ఎంపిక అయినట్లు ప్రిన్సిపాల్ పి. నీరజ తెలిపారు.మండల రెవెన్యూ అధికారి, నేరేడుచర్ల ఆదేశాల మేరకు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఈ నెల 09న “స్వచ్ఛమైన, పవిత్రమైన ఓటర్ల జాబితా” అనే అంశంపై వ్యాసరచన మరియు క్విజ్ పోటీలు నిర్వహించగా, అ పోటీలో కళాశాల స్థాయిలో ప్రతిభ కనబరిచి విజయం సాధించిన ఎస్.కె. సమీనా, ఎస్.కె. సమీరా, గోపి మరియు కె. ఏకశ్రీ డివిజన్ స్థాయి పోటీలకు ఎంపికయ్యారు.
మంగళవారం హుజూర్నగర్లో నిర్వహించిన డివిజన్ స్థాయి వ్యాసరచన మరియు క్విజ్ పోటీల్లో ప్రభుత్వ జూనియర్ కళాశాల, నేరేడుచర్ల తరఫున ఎంపీసీ ద్వితీయ సంవత్సరం విద్యార్థిని కె. ఏకశ్రీ వ్యాసరచన పోటీలో ఆరో స్థానం సాధించి జిల్లా స్థాయి పోటీలకు ఎంపికయింది.
ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ పి. నీరజ, ఎన్ ఎస్ ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ వనపర్తి శ్రీనివాసులు, అధ్యాపకులు, సిబ్బంది వెంకటరమణ, డా. సైదులు, అపర్ణ,ప్రణతి, కె.ఎల్.ఎన్. నరసింహారావు, అన్వేష్ తదితరులు ఏకశ్రీని అభినందించి, జిల్లా స్థాయి పోటీల్లో కూడా ఉత్తమ ప్రతిభ కనబరిచి విజయం సాధించాలని ఆకాంక్షించారు.