సీఎం సభకు కాంగ్రెస్ శ్రేణులు భారీగా తరలిరావాలి

10-11-2026 | 09:08pm

సిద్దిపేట డీసీసీ అధ్యక్షురాలు తూంకుంట అంక్షా రెడ్డి పిలుపు

గజ్వేల్, నవంబర్ 10: ఈ నెల 19న సిద్దిపేటలో(Siddipet) ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి(Revanth Reddy) పాల్గొననున్న బహిరంగ సభను కాంగ్రెస్ శ్రేణులు(Congress ranks) సమిష్టి కృషితో విజయవంతం చేయాలని సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు తూంకుంట అంక్షా రెడ్డి(Thumkunta Anksha Reddy) పిలుపునిచ్చారు. మంగళవారం గజ్వేల్‌లో(Gajwel) ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. సిద్దిపేట సభలో ముఖ్యమంత్రి పలు సంక్షేమ పథకాలను(welfare schemes) ప్రకటించనున్న నేపథ్యంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రతిష్టాత్మకంగా తీసుకొని సభకు భారీగా తరలిరావాలని కోరారు.

సీఎం రేవంత్‌రెడ్డి సిద్దిపేట పర్యటనను పార్టీ అధిష్ఠానం ప్రతిష్టాత్మకంగా భావిస్తోందని, ఈ నేపథ్యంలో ప్రతి నాయకుడు, కార్యకర్త బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. గ్రామాలు, మండలాలు, పట్టణాల్లో ప్రజలను కలిసి సభకు ఆహ్వానించాలని, ప్రతి గ్రామం నుంచి పెద్ద సంఖ్యలో పార్టీ శ్రేణులు తరలివచ్చేలా కార్యాచరణ రూపొందించుకోవాలని తెలిపారు. సభకు తరలింపు ఏర్పాట్లలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా పరస్పర సమన్వయంతో పనిచేయాలని కోరారు. కార్యకర్తలే కాంగ్రెస్ పార్టీకి బలమని, పార్టీ కుటుంబ సభ్యులంతా ఐక్యంగా కృషిచేసి సీఎం సభను విజయవంతం చేయాలని అంక్షా రెడ్డి విజ్ఞప్తి చేశారు.

మరిన్ని వార్తలు