ఒకే చెట్టుపై ముగ్గురు దేవుళ్ల ప్రతిరూపాలు?
09-11-2026 | 12:54pm
భిక్కనూర్, నవంబర్ 9 (విజయ క్రాంతి): భిక్కనూర్ మండలం(Bikkanur Mandal) ఇసన్నపల్లి గ్రామంలోని హరిజనవాడ కాలనీలో ఓ చెట్టుపై వినాయకుడు, నరసింహస్వామి, హనుమంతుడి రూపాలు కనిపిస్తున్నాయంటూ స్థానికులు ఆసక్తి వ్యక్తం చేస్తున్నారు. చెట్టుపై కనిపిస్తున్న ఆకారాలను ఫొటోలు తీసి సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఆ ఆకారాలు దేవుళ్ల ప్రతిరూపాలను పోలి ఉండటంతో కాలనీవాసులు వాటిని ఆసక్తిగా గమనిస్తున్నారు. ఈ దృశ్యాలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. మరి ఈ చెట్టుపై కనిపిస్తున్న ఆకారాలు మీకూ దైవ స్వరూపాల్లా కనిపిస్తున్నాయా? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.