కామానికి బలైన బాలుడు

10-11-2026 | 09:31pm

స్నేహమే మరణానికి శాపంగా మారిందా

అక్రమ సంబంధం బయట పెడతాడనే భయంతో హత మార్చిన వైనం

కూల్ డ్రింక్ లో పురుగులు ముందు ఇచ్చి చంపేసిన నిందితులు

కల్లూరు. సత్తుపల్లి. నవంబర్ 10. ( విజయక్రాంతి ) : అక్రమ సంబంధం(Illicit affair) ఎక్కడ బయటపెడతాడోనని తోటి స్నేహితుడినే నిందితురాలతో కలిసి హతమార్చిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. మండల పరిధిలోని చిన్నకోరుకొండి గ్రామంలో(Chinnakorukondi Village) చోటుచేసుకుంది. చంపినవాడు చనిపోయిన బాలుడు మైనర్లు కావడంతో మరింత కలకలం రేపుతుంది. చిన్న వయసులోనే మనిషిని చంపాలనే క్రూరమైన ఆలోచనలు, అక్రమ సంబంధాలకి అలవాటు పడడంతో సమాజానికి ఏం సంకేతం ఇస్తున్నామో అర్థం కానీ నీచమైన దుస్థితి కలవరపెడుతుంది.

కొడుకు మరణంతో (మూగ)గా రోదిస్తున్న తండ్రి. సాంప్రదాయాలను తుంగలో తొక్కి మైనర్ బాలుడుతో అక్రమ సంబంధం పెట్టుకున్న వివాహిత బాలుడు మరణానికి కారణమని జిల్లెల్ల రవికుమార్ కుటుంబ సభ్యులు, గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. నిందితుడు చిన్నకోరుకొండి గ్రామానికి చెందిన నామ అజయ్ తండ్రి రాజ అదే గ్రామంలో జిల్లా పరిషత్ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నాడని తెలిపారు. బోనకల్లు మండలం గోవిందపురం గ్రామానికి చెందిన వివాహిత ఇరుగు అపర్ణ వాళ్ల పెద్దమ్మ ఇంటికి చిన్నకోరుకొండి రావడం ఈ క్రమంలో మైనర్ బాలుడితో అక్రమ సంబంధం ఏర్పరచుకుందని తెలిపారు.

వాళ్ళిద్దరి అక్రమ సంబంధం చూసిన మృతుడు జిల్లెల రవికుమార్ ను బ్రతకనిస్తే తమ సంబంధాన్ని గురించి గ్రామంలో చెప్తాడనే ఆలోచనతో తనని హతమార్చాలని పక్కా ప్రణాళికతో కూల్ డ్రింక్ లో పురుగుల మందు కలిపి నమ్మకంగా తన స్నేహితుని ద్వారా తాగించారని తెలియజేశారు. ఖమ్మం హాస్పిటల్ లో దాదాపు పది రోజులపాటు మృత్యువుతో పోరాడి మరణించాడు.

కుటుంబ కలహాలతో ఇక్కడికి వచ్చి అక్రమ సంబంధంతో ఇద్దరు మైనర్ బాలురుల జీవితాన్ని నాశనం చేసిందని వాపోయారు. ఒకరికి జీవితమే లేకుండా పోయింది మరొకరిని జైలు పాలు చేసిందని అంటున్నారు. ఇటువంటి దుర్ఘటనతో మండలంలో పిల్లల తల్లిదండ్రులు భయాందోళనకు గురవుతున్నారు. తమ పిల్లలు ఎటువంటి స్నేహితులతో తిరుగుతున్నారో వారి ప్రవర్తన ఎట్లుందోనని ఆందోళన చెందుతున్నారు.

మరిన్ని వార్తలు