ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో చలి

09-11-2026 | 01:47pm

పలు ప్రాంతాల్లో 15 డిగ్రీల లోపే కనిష్ఠ ఉష్ణోగ్రతలు

డోంగ్లిలో 14.8 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదు

కోటగిరి, డిచ్‌పల్లిలో 14.9 డిగ్రీల ఉష్ణోగ్రత

తెల్లవారుజామున పెరుగుతున్న చలి ప్రభావం

బోధన్,నవంబర్ 09 (విజయ క్రాంతి): ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో(Nizamabad District) చలి తీవ్రత క్రమంగా పెరుగుతోంది. గత 24 గంటల్లో జిల్లాలోని పలు ప్రాంతాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు 15 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువగా నమోదయ్యాయి. వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో తెల్లవారుజామున, రాత్రి వేళల్లో చలి ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది. కామారెడ్డి జిల్లాలో డోంగ్లి ప్రాంతంలో అత్యల్పంగా 14.8 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. సోమూర్, ఎల్పుగొండ, పెద్దకొడప్గల్ ప్రాంతాల్లో 14.9 డిగ్రీలు, బిచ్కుంద, ఇసాయిపేట, రామలక్ష్మణపల్లి ప్రాంతాల్లో 15 డిగ్రీలు నమోదయ్యాయి.

బీర్కూర్, నస్రుల్లాబాద్ ప్రాంతాల్లో 15.1 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. అదేవిధంగా నిజామాబాద్ జిల్లాలో కోటగిరి, డిచ్‌పల్లి ప్రాంతాల్లో 14.9 డిగ్రీలు, పోతంగల్‌లో 15 డిగ్రీలు, గోపన్‌పల్లి, జకోరా, రుద్రూర్ ప్రాంతాల్లో 15.1 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టడంతో ఉదయం వేళల్లో బయటకు వెళ్లేవారు, రైతులు, వృద్ధులు చలి నుంచి రక్షణకు తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. రానున్న రోజుల్లో చలి ప్రభావం మరింత పెరిగే అవకాశాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ పరిస్థితులను గమనిస్తున్నారు.

మరిన్ని వార్తలు