డిమాండ్లు నెరవేర్చకపోతే డిసెంబర్ 15 నుంచి ఆశాల సమ్మె

10-11-2026 | 09:25pm

సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు బి శివ వర్మ డిమాండు

కొల్లాపూర్ నవంబర్ 10: నాగర్ కర్నూల్ జిల్లా(Nagarkurnool District) కొల్లాపూర్ మండలంలో ఆశ వర్కర్స్ యూనియన్(ASHA Workers' Union) సిఐటియు ఆధ్వర్యంలో మంగళవారం  మంత్రి జూపల్లి కృష్ణారావు(Minister Jupally Krishna Rao)  క్యాంప్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు(CITU) జిల్లా ఉపాధ్యక్షులు బి శివ వర్మ మాట్లాడుతూ. ఆశా వర్కర్లు 28 వేల మంది గత 20 సంవత్సరాల నుండి పనిచేస్తున్నారు. వీరంతా బడుగు, బలహీన వర్గాలకు చెందిన మహిళలు, రూరల్ 1,000, పట్టణంలో 2,000 నుండి 5,000 మంది ప్రజలకు ఆశాలు సేవలందిస్తున్నారు.

ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ నాయకులు ఆశలు చేస్తున్న పోరాటంలో ప్రత్యక్షంగా పాల్గొని మేము అధికారంలోకి వస్తే ఆశాలు అడుగుతున్న డిమాండ్స్ అన్నిటిని పరిష్కారం చేస్తామని హామీ ఇచ్చారు. ఆశలకు గత బిఆర్ఎస్ ప్రభుత్వం ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని రాష్ట్రంలో రాష్ట్రాలు అనేక పోరాటాలు చేశారు. హైదరాబాద్ కోటి కమిషనర్ ఆఫీస్ ముందు చేసిన పోరాటాల సందర్భంగా 2024 ఫిబ్రవరి 9న జూలై 30న డిసెంబర్ 10న రాష్ట్ర ఉన్నంత అధికారులు ఆశాలకు రూపాయలు యాభై లక్షలు ఇన్సూరెన్స్.

50 లక్షలు మట్టి ఖర్చులు. రిటైర్మెంట్ బెనిఫిట్స్ సెలవులు టార్గెట్స్ సింటమ్స్ డబ్బాలు వేయడం రద్దు ప్రమోషన్స్ సౌకర్యం కల్పించాలని రూపాయలు 18 వేల రూపాయలు ఫిక్స్డ్ వేతనం కోసం ఫైల్ ప్రొసెట్లో ఉందని చెప్పారు. కానీ ఇప్పటివరకు ఇచ్చిన హామీలు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయడం లేదని వారు ఆరోపిస్తున్నారు.

హామీలు అమలు చేయకపోతే  డిసెంబర్ 15వ తేదీన నిరవధిక సమ్మె చేపడతామని హెచ్చరించారు. వివిధ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని క్యాంప్ ఆఫీస్ నరసింహకు అందజేశారు.ఈ కార్యక్రమంలో ఆశా వర్కర్ల యూనియన్ జిల్లా కార్యదర్శి కళావతి. సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు బి శివ వర్మ. ఆశ వర్కర్స్ యూనియన్ పీహెచ్సీ అధ్యక్ష కార్యదర్శులు శివలీల శ్రీదేవి చెన్నమ్మ. ఆశాలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు