తెలంగాణ, ఏపీకి కృష్ణా బోర్డు లేఖ!

10-11-2026 | 06:28pm

హైదరాబాద్: కృష్ణా నది(Krishna River)పై ఉన్న ప్రధాన ప్రాజెక్టుల నిర్వహణ, నీటి వినియోగంపై కృష్ణా నది యాజమాన్య బోర్డు (Krishna River Management Board) దృష్టి సారించింది. శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టులకు సంబంధించి పూర్తి వివరాలు సమర్పించాలని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ఇంజినీర్-ఇన్-చీఫ్‌లకు లేఖ రాసింది. ప్రాజెక్టులకు మొదట మంజూరైన అనుమతులు, ఆ తర్వాత చేపట్టిన మార్పులు, కొత్తగా చేర్చిన పథకాల వివరాలను కోరింది. ఎడమ, కుడి కాల్వల ద్వారా నీటి మళ్లింపు, వినియోగం, ఆయకట్టు పరిధి, సాగు, విద్యుత్, తాగునీటి అవసరాలకు సంబంధించిన సమాచారాన్ని అందించాలని సూచించింది.

అలాగే ప్రాజెక్టుల డిజైన్లు, సామర్థ్యం, అదనపు నీటి అవసరాలు, సాంకేతిక అనుమతులు, కేంద్ర జలసంఘం తదితర సంస్థల క్లియరెన్స్ పత్రాలను సమర్పించాలని స్పష్టం చేసింది. ప్రాజెక్టుల్లో చేసిన మార్పుల వల్ల నీటి లభ్యతపై పడే ప్రభావాన్ని కూడా వివరించాలని కోరింది. రెండు రాష్ట్రాల నుంచి వివరాలు అందిన తర్వాత ప్రాజెక్టుల అనుమతులు, నీటి వినియోగానికి సంబంధించిన అంశాలను పరిశీలించనుంది.

మరిన్ని వార్తలు