ఏసీబీ చిక్కిన బైంసా ఇంచార్జి మున్సిపల్ కమిషనర్
* రూ. 50 వేలు తీసుకుంటూ పట్టుబడ్డ ఇన్చార్జి మున్సిపల్ కమిషనర్ జాదవ్ సంతోష్.
* సినీ పక్కిలో రెండు కిలోమీటర్లు వెంబడించి పట్టుకున్న ఏసీబీ అధికారులు.
నిర్మల్ జిల్లా: నిర్మల్ జిల్లాలో(Nirmal District) కేంద్రంలో మంగళవారం ఏసీబీ అధికారులు(ACB officials) నిర్వహించిన దాడిలో రూ.50 లంచం తీసుకుంటూ బైంసా ఇంచార్జ్ మున్సిపల్ కమిషనర్ జాదవ్ సంతోష్(Bhainsa In-charge Municipal Commissioner Jadhav Santosh) పట్టుబడ్డారు. దీనికి సంబంధించిన వివరాలను ఏసీబీ డిఎస్పి మధు(ACB DSP Madhu) వెల్లడించారు. భైంసా మున్సిపల్(Bhainsa Municipal) పరిధిలో చేపట్టిన అభివృద్ధి పనులకు కాంట్రాక్టర్ బిల్లు చెల్లించేందుకు లంచం డిమాండ్ చేసినట్టు ఆయన తెలిపారు.
ఓ కాంట్రాక్టర్ కు చెందిన 2 లక్షల 60 వేల బిల్లు మంజూరు చేసే విషయంలో 50 వేల రూపాయలు లంచం డిమాండ్ చేయడంతో సదరు కాంట్రాక్టర్ ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు దీంతో మంగళవారం సాయంత్రం జిల్లా కేంద్రంలోని ఓ హోటల్ వద్ద 50 వేలు లంచం సొమ్మును ఆయన కారులో పెట్టుకుని వెళ్తుండగా ఏసీబీ అధికారులు కారును సినీ పక్కిలో రెండు కిలోమీటర్లు వెంబడించి శాంతినగర్ చౌరస్తా వద్ద పట్టుకున్నారు. నడిరోడ్డుపై ఏసీబీ అధికారులు కారును అడ్డగించి కారులో ఉన్న నగదును స్వాధీనం చేసుకున్నారు.
అక్కడి నుంచి నేరుగా దివ్య నగర్ లో ఉన్న ఆయన నివాసానికి వెళ్లి సోదాలు నిర్వహించారు. ఏసిపికి పట్టుబడ్డ జాదవ్ సంతోషం అదుపులోకి తీసుకుని కరీంనగర్ ఏసీబీ కోర్టులో హాజరు పరుస్తామని డిఎస్పీ వెల్లడించారు. ప్రభుత్వ అధికారులు లంచం డిమాండ్ చేస్తే ప్రజలు భయపడకుండా ఏసీబీకి ఫిర్యాదు చేయాలని సూచించారు. ఫిర్యాదుల కోసం 9154388963, టోల్‌ఫ్రీ నంబర్ 1064, ఏసీబీ హెల్ప్‌లైన్ వాట్సాప్ నంబర్ 9440446106ను సంప్రదించవచ్చని తెలిపారు.