భూ భారతి ఆపరేటర్లకు గుడ్‌న్యూస్
హైదరాబాద్: తెలంగాణలో భూ భారతి ఆపరేటర్ల(Bhu Bharati Operators)కు పెండింగ్‌లో ఉన్న వేతనాల(Pending Wages) వ్యవహారంపై రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ (Telangana Human Rights Commission) స్పందించింది. ఏడు నెలలుగా జీతాలు అందకపోవడంపై వచ్చిన ఫిర్యాదును పరిశీలించిన కమిషన్.. బకాయిల చెల్లింపునకు అవసరమైన చర్యలు తీసుకోవాలని రెవెన్యూ శాఖ కార్యదర్శికి సిఫార్సు చేసింది.
కామారెడ్డి జిల్లా కొండాపూర్‌కు చెందిన లింగం ఈ సమస్యపై కమిషన్‌ను ఆశ్రయించారు. రాష్ట్రవ్యాప్తంగా భూ భారతి వ్యవస్థ(Bhu Bharati System)లో పనిచేస్తున్న ఆపరేటర్లకు ఏడు నెలలుగా వేతనాలు చెల్లించడం లేదని ఫిర్యాదు చేశారు. దీనిని విచారించిన హెచ్ఆర్సీ.. ఉద్యోగుల వేతన బకాయిల సమస్యను పరిష్కరించాలని రెవెన్యూ శాఖ కార్యదర్శికి సూచించింది.
మరోవైపు గోల్కొండకు చెందిన షేక్ సాజిద్ అహ్మద్ చేసిన ఫిర్యాదుపైనా మానవ హక్కుల కమిషన్(Human Rights Commission) స్పందించింది. గోల్కొండ పోలీస్ స్టేషన్లో తనను అక్రమంగా నిర్బంధించి, దాడి చేశారని ఆయన ఆరోపించారు. ఈ వ్యవహారంలో పోలీసుల వివరణతో కమిషన్ సంతృప్తి చెందలేదు. వైద్య రికార్డుల్లో గాయాల ప్రస్తావనను కూడా పరిగణనలోకి తీసుకుంది. దీంతో ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపించాలని హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌కు సిఫార్సు చేసింది.
అహ్మద్ చేసిన ఆరోపణలపై చట్ట ప్రకారం విచారణ జరిపి, తీసుకున్న చర్యల వివరాలతో ఆరు నెలల్లో నివేదిక సమర్పించాలని హైదరాబాద్ సీపీని హెచ్ఆర్సీ కోరింది. ఒకవైపు ప్రభుత్వ ఉద్యోగుల వేతన బకాయిల సమస్య.. మరోవైపు పోలీసులపై వచ్చిన ఆరోపణలపై కమిషన్ స్పందించడం రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది.