గాయాల నుంచి కోలుకుంటున్న మాట్ హెన్రీ

11-11-2026 | 12:55pm

భారత్‌తో టెస్టు సిరీస్‌పై గురి

న్యూజిలాండ్ ఫాస్ట్ బౌలర్ మాట్ హెన్రీ(New Zealand Fast Bowler Matt Henry) ఇటీవల ఎదుర్కొన్న గాయాల నుంచి కోలుకుంటూ, భారత్‌తో జరగనున్న టెస్టు సిరీస్‌కు సిద్ధమవుతున్నాడు. స్వదేశంలో జరగనున్న సుదీర్ఘ క్రికెట్ షెడ్యూల్‌లో కీలక పాత్ర పోషించేందుకు ఆసక్తిగా ఉన్నాడు. భారత్‌(India)తో వన్డే సిరీస్ సందర్భంగా ప్రాక్టీస్‌లో సహచర ఆటగాడు డెవాన్ కాన్వే(Devon Conway)తో ఢీకొనడంతో హెన్రీ తలకు గాయమైంది. దీంతో మూడో వన్డేకు దూరమయ్యాడు. అయితే గాయం నుంచి వేగంగా కోలుకుంటున్నానని, తిరిగి మైదానంలోకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నానని వెల్లడించాడు.

క్వాడ్రిసెప్స్ కండరానికి స్వల్ప సమస్య ఉన్నప్పటికీ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపాడు. వరుసగా మ్యాచ్‌లు ఉండటంతో బౌలర్ల పనిభారాన్ని సమర్థంగా నిర్వహించడం ముఖ్యమని అభిప్రాయపడ్డాడు. భారత్‌తో టెస్టు సిరీస్ తమకు ఎంతో కీలకమని, ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో మెరుగైన స్థానం సాధించేందుకు ప్రతి మ్యాచ్‌లోనూ రాణించడమే లక్ష్యమని హెన్రీ పేర్కొన్నాడు. ప్రత్యర్థుల ఫలితాల కంటే తమ ప్రదర్శనపైనే దృష్టి పెడతామని స్పష్టం చేశాడు.

మరిన్ని వార్తలు