చలికాలంలో జలుబు నుంచి ఉపశమనం.. ఈ చిట్కాలు మీకోసం!
ముక్కు కారడం, ముక్కు మూసుకుపోవడం, తుమ్ములు, గొంతునొప్పి, దగ్గు, ఛాతిలో బిగుతు, తలనొప్పి, స్వల్ప జ్వరం వంటి లక్షణాలతో సాధారణ జలుబు (Common Cold) వస్తుంది. ప్రధానంగా రైనోవైరస్ (Rhinovirus) కారణంగా ఈ అనారోగ్యం వ్యాపిస్తుంది. శీతాకాలంలో ఇది ఎక్కువగా కనిపిస్తుంది. ఫ్లూతో పోలిస్తే తీవ్రత తక్కువగా ఉన్నప్పటికీ, కోలుకోవడానికి తగినంత విశ్రాంతి అవసరం. సాధారణంగా మందులు లేకుండానే వారం రోజుల్లో తగ్గుతుంది. శరీరాన్ని తేమగా ఉంచేందుకు తగినన్ని ద్రవపదార్థాలు తీసుకోవాలి. సెలైన్ రిన్సెస్, ముక్కులోని రద్దీని తగ్గించే మందులు (Decongestants), అలర్జీ లక్షణాలను తగ్గించే మందులు (Antihistamines), గదిలో తేమను పెంచే పరికరాలు ఉపయోగించడం ద్వారా లక్షణాల నుంచి ఉపశమనం పొందవచ్చు.