కాంట్రాక్టర్‌ను బ్లాక్‌లిస్ట్ చేస్తాం: ఉత్తమ్

11-11-2026 | 01:57pm

కోదాడ: సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంలో జాప్యాన్ని సహించేది లేదని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి(Irrigation Minister Uttam Kumar Reddy) స్పష్టం చేశారు. కోదాడ మండలంలోని రెడ్లకుంట ఎత్తిపోతల పథకం(Redlakunta Lift Irrigation Project) పనులను ఎంపీ రఘువీర్ రెడ్డితో కలిసి ఆయన పరిశీలించారు. అనంతరం పనుల పురోగతిపై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా పనులు ఆశించిన వేగంతో సాగకపోవడంపై మంత్రి అసహనం వ్యక్తం చేశారు. రెడ్లకుంట ఎత్తిపోతల పథకాన్ని డిసెంబర్ చివరి నాటికి, శాంతినగర్ రాజీవ్ ఎత్తిపోతల పథకాన్ని(Shantinagar Rajiv Lift Irrigation) వచ్చే ఫిబ్రవరి నాటికి పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. నిర్దేశించిన గడువులోగా పనులు పూర్తి చేయకపోతే సంబంధిత కాంట్రాక్టర్‌ను బ్లాక్‌లిస్ట్‌లో పెడతామని హెచ్చరించారు.

ఈ రెండు ఎత్తిపోతల పథకాలు(Lift irrigation schemes) పూర్తయితే సుమారు 9,500 ఎకరాలకు సాగునీరు అందుబాటులోకి వస్తుందని మంత్రి తెలిపారు. రాష్ట్రంలో కృష్ణా, గోదావరి జలాలను సమర్థంగా వినియోగించుకునేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోందన్నారు. అలాగే యాసంగి సీజన్‌లో వరి సాగుకు దూరంగా ఉండాలని, ప్రత్యామ్నాయ పంటల సాగుపై దృష్టి సారించాలని రైతులకు మంత్రి విజ్ఞప్తి చేశారు. సాగునీటి ప్రాజెక్టులను సకాలంలో పూర్తి చేసి రైతులకు ప్రయోజనం చేకూర్చడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు