ఘనంగా జాతీయ విద్యా దినోత్సవం

11-11-2026 | 06:31pm

మంచిర్యాల క్రైమ్, (విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా కేంద్రంలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాలలో (Telangana Social Welfare Residential Women’s Degree College) భారతదేశ తొలి విద్యాశాఖ మంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతిని పురస్కరించుకుని బుధ వారం "జాతీయ విద్యా దినోత్సవాన్ని" ఘనంగా నిర్వహించారు.

విద్య యొక్క ప్రాముఖ్యత, సమాజ అభివృద్ధిలో విద్య పాత్ర, ప్రతి ఒక్కరికీ నాణ్యమైన విద్య అందించాల్సిన అవసరం గురించి విద్యార్థులకు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ పత్తి సునీత వివరించారు. NSS యూనిట్-1 కోఆర్డినేటర్ Md రిజ్వాన, యూనిట్- 2 కోఆర్డినేటర్ ఎస్.సత్యరాణి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపాల్ వహీదా,   ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు