కలెక్టర్‌పై హైకోర్టు అసహనం

11-11-2026 | 03:06pm

హైదరాబాద్: మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా కలెక్టర్‌ను కోర్టులో హాజరుపరచాలని మల్కాజిగిరి పోలీస్ కమిషనర్‌(Malkajgiri Police Commissioner)ను తెలంగాణ హైకోర్టు(Telangana High Court) ఆదేశించింది. బుధవారం విచారణకు కలెక్టర్ హాజరుకాకపోవడంపై న్యాయస్థానం అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం.

ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకునే విషయంలో కలెక్టర్ నిర్లక్ష్యంగా వ్యవహరించారన్న అంశంపై విచారణ సందర్భంగా హైకోర్టు తీవ్రంగా స్పందించినట్లు తెలుస్తోంది. కోర్టు ఆదేశాల మేరకు కలెక్టర్‌ను హాజరుపరిచేలా చర్యలు తీసుకోవాలని పోలీస్ కమిషనర్‌కు సూచించింది. ప్రభుత్వ భూముల పరిరక్షణ, కోర్టు ఆదేశాల అమలులో అధికారుల బాధ్యతపై ఈ పరిణామం ప్రాధాన్యత సంతరించుకుంది.

మరిన్ని వార్తలు