రాష్ట్రస్థాయి సెపక్ తక్రా పోటీలకు ఎంపిక

11-11-2026 | 06:29pm

ఆసిఫాబాద్, నవంబర్ 11 (విజయక్రాంతి): జనగామ జిల్లాలో నవంబర్ 12 నుంచి 14 వరకు నిర్వహించనున్న రాష్ట్రస్థాయి అండర్‌-14 సెపక్ తక్రా బాలుర పోటీలకు(Under-14 Sepak Takraw Boys' Competition) ఆసిఫాబాద్ గిరిజన ఆశ్రమ పాఠశాలకు చెందిన 8వ తరగతి విద్యార్థి కుర్సెంగా కేశవరావు ఎంపికయ్యాడు.

ఈ నెల 6న జరిగిన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా స్థాయి ఎంపిక పోటీల్లో ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయి పోటీలకు అర్హత సాధించాడు. ఈ సందర్భంగా ఐటీడీఏ పీవో మందా మకరంద్, గిరిజన సంక్షేమ శాఖ డీడీ జాదవ్ అంబాజీ విద్యార్థిని అభినందించి శుభాకాంక్షలు తెలిపారు.

మరిన్ని వార్తలు