యూఏఈలో ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం

11-11-2026 | 06:23pm

నిర్మాణ రంగంలో ఉద్యోగ అవకాశాలు..

అర్హులైన అభ్యర్థులు సద్వినియోగం చేసుకోవాలి

జిల్లా ఉపాధి కల్పన అధికారిణి విజేత

బోధన్, నవంబర్ 11 (విజయక్రాంతి): యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ)లో నిర్మాణ రంగానికి సంబంధించిన ఉద్యోగాల భర్తీ కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారిణి విజేత తెలిపారు. తెలంగాణ ప్రభుత్వానికి చెందిన తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్ పవర్ కంపెనీ లిమిటెడ్ (Telangana Overseas Manpower Company Limited) ఆధ్వర్యంలో ఈ ఉద్యోగ నియామక ప్రక్రియ చేపడుతున్నట్లు వెల్లడించారు.

విదేశాల్లో ఉద్యోగాలు చేయాలనే ఆసక్తి కలిగిన నిరుద్యోగ యువతకు ఇది మంచి అవకాశమని ఆమె పేర్కొన్నారు. జిల్లాలోని ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. విదేశీ ఉద్యోగాల కోసం ప్రయత్నించే అభ్యర్థులు ప్రభుత్వ సంస్థ అయిన టామ్‌కామ్ ద్వారా అందిస్తున్న ఈ అవకాశాన్ని పరిశీలించి దరఖాస్తు చేసుకోవాలని కోరారు.

ఉద్యోగాలకు సంబంధించిన మరిన్ని వివరాలు, అర్హతలు మరియు ఇతర సమాచారం కోసం 9848913160 నంబర్‌ను సంప్రదించాలని జిల్లా ఉపాధి కల్పన అధికారిణి విజేత తెలిపారు. అర్హులైన అభ్యర్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకుని విదేశాల్లో ఉపాధి పొందేందుకు ముందుకు రావాలని ఆమె సూచించారు.

మరిన్ని వార్తలు