గ్రీస్‌లో పెళ్లి వేడుకలు.. చెన్నైలో గ్రాండ్ రిసెప్షన్
ప్రముఖ సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్, సన్‌రైజర్స్(Sunrisers) హైదరాబాద్ సహ యజమాని కావ్య మారన్ వివాహ వేడుకలపై దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. వీరిద్దరి వివాహ వేడుకలు గ్రీస్‌లో నిర్వహిస్తున్నట్లు సమాచారం. సినీ, రాజకీయ, వ్యాపార రంగాలకు చెందిన ప్రముఖులు ఈ వేడుకల్లో పాల్గొనేందుకు గ్రీస్‌కు చేరుకుంటున్నారు.
ఈ వివాహ వేడుకల కోసం మారన్ కుటుంబం ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు తెలుస్తోంది. అతిథుల రాకపోకల కోసం నాలుగు ప్రైవేట్ విమానాలను ఏర్పాటు చేసినట్లు వార్త నడుస్తుంది. విమాన ప్రయాణంతో పాటు వసతి, స్థానిక రవాణా బాధ్యతలను కూడా కుటుంబ సభ్యులే చూసుకుంటున్నట్లు కథనాలు పేర్కొంటున్నాయి. పరిమిత సంఖ్యలో కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో ఈ వేడుకలను నిర్వహిస్తున్నట్లు సమాచారం.
ఈ వివాహ వేడుకకు సినీ, రాజకీయ రంగాలకు చెందిన ప్రముఖులను ఆహ్వానించినట్లు తెలుస్తోంది. సూపర్‌స్టార్ రజనీకాంత్, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తదితర ప్రముఖులు గ్రీస్‌కు బయలుదేరినట్లు టాక్ వినిపిస్తుంది. విమానాశ్రయాల్లో ప్రముఖులు కనిపించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో అనిరుధ్–కావ్య వివాహం సినీ, రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
అందమైన సముద్ర తీరాలు, తెల్లని భవనాలు, ఆహ్లాదకరమైన వాతావరణం, విలాసవంతమైన రిసార్టులు.. ఇలా గ్రీస్‌లో డెస్టినేషన్ వెడ్డింగ్‌కు అనువైన ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. అందుకే ఈ జంట వివాహ వేడుకలకు గ్రీస్‌ను ఎంపిక చేసుకున్నట్లు ట్రావెల్ కథనాలు పేర్కొంటున్నాయి. అయితే ఖచ్చితమైన వివాహ వేదికను కుటుంబాలు అధికారికంగా వెల్లడించలేదు. శాంటోరినిలోనే వేడుక జరుగుతోందన్న ప్రచారంపైనా స్పష్టత లేదు.
గ్రీస్‌లో జరిగే ప్రైవేట్ వివాహ వేడుకల అనంతరం నవంబర్ 21న చెన్నైలో ఘనంగా రిసెప్షన్ నిర్వహించనున్నట్లు సమాచారం. ఈ వేడుకకు దేశవ్యాప్తంగా పలువురు ప్రముఖులను ఆహ్వానిస్తున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కూడా కావ్య మారన్ తల్లిదండ్రులు ఆహ్వానం అందించినట్లు తెలంగాణ సీఎంవో గతంలో వెల్లడించింది.
మొత్తానికి అనిరుధ్ సంగీత ప్రపంచంలో సంపాదించుకున్న గుర్తింపు, కావ్య మారన్‌కు ఉన్న వ్యాపార, క్రికెట్ రంగాల పరిచయాలతో ఈ వివాహ వేడుకలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. గ్రీస్‌లో ప్రైవేట్ వేడుకలు.. చెన్నైలో గ్రాండ్ రిసెప్షన్‌తో ఈ సెలబ్రిటీ జంట పెళ్లి వేడుకలు వార్తల్లో నిలుస్తున్నాయి.