జిల్లా స్థాయి యువజనోత్సవ పోటీలు

11-11-2026 | 06:29pm

జగిత్యాల, నవంబర్ 11 (విజయక్రాంతి): బుధవారం రోజున జిల్లా యువజన, క్రీడల శాఖ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి యువనోత్సవ పోటీలు(Youth Festival Competitions) నిర్వహించడం జరిగింది. ఇందులో జానపదా నృత్యం బృందం 9 గ్రూపులు, 5 జానపద గేయ బృందాలు, పెయింటింగ్ 12 మంది సభ్యులు, పోయెట్రీ కింద 15 మంది సభ్యులు మొత్తంగా 167 మందితో జిల్లా స్థాయి యువజన ఉత్సవాలు ఘనంగా నిర్వహించడం జరిగింది.

ఈ కార్యక్రమమునకు మున్సిపల్ కమిషనర్ సత్య ప్రణవ్, మూడో వార్డు కౌన్సిలర్ అరవ లక్ష్మి, ఎస్ కె ఎన్ ఆర్ డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్, ఎస్ కె ఎన్ ఆర్ బాయ్స్ కాలేజ్ ప్రిన్సిపాల్, ఎస్ కే ఎన్ ఆర్ గర్ల్స్ కాలేజ్ తరఫున ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ తిరుపతిరెడ్డి, తెలంగాణ సాంస్కృతిక సారధి అధ్యక్షులు పరశురాం గౌడ్, యువజన సంఘాల నాయకులు రాజేష్, విక్రమ్ రెడ్డి, నేషనల్ యూత్ అవార్డు గ్రహీత అయిన కొండ రవి పాల్గొన్నారు. ఈ కార్యక్రమం క్రింద జడ్జిగా పాల్గొన్న ఎలిగేటి రాజేంద్రప్రసాద్, సతీష్, పరశురామ్ గౌడ్, శ్యాంసుందర్ పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించి నారని జిల్లా యువజ, క్రీడల శాఖ అధికారి డాక్టర్ కోరుకంటి రవికుమార్ ఒక ప్రకటనలో తెలిపారు.

మరిన్ని వార్తలు