భగీరథిపల్లిలో 10 సీసీ కెమెరాల ప్రారంభం

11-11-2026 | 06:12pm

భిక్కనూర్, నవంబర్ 11 (విజయ క్రాంతి): భిక్కనూర్ పోలీస్ స్టేషన్(Bikkanur Police Station) పరిధిలోని భగీరథిపల్లి గ్రామంలో(Bhagirathipalli Village) ప్రజల భద్రత, నేరాల నియంత్రణ కోసం ఏర్పాటు చేసిన 10 సీసీ కెమెరాలను బుధవారం ప్రారంభించారు. గ్రామంలోని ప్రధాన రహదారులు, ముఖ్యమైన ప్రదేశాలు, ప్రవేశ, నిష్క్రమణ మార్గాల్లో వీటిని ఏర్పాటు చేశారు.

సీసీ కెమెరాల ద్వారా అనుమానాస్పద కార్యకలాపాలను గుర్తించడంతో పాటు నేరాల దర్యాప్తులో ఫుటేజ్ ఉపయోగపడుతుందని పోలీసులు తెలిపారు. ప్రతి గ్రామంలో సీసీ కెమెరాల ఏర్పాటుకు ప్రజలు సహకరించాలని సూచించారు. కెమెరాల ఏర్పాటుకు సహకరించిన గ్రామ ప్రజలు, పెద్దలు, ప్రతినిధులకు భిక్కనూర్ పోలీసులు కృతజ్ఞతలు తెలిపారు.

మరిన్ని వార్తలు