ఆసియా కప్‌లో భారత్ జోరు.. నేపాల్ చిత్తు!

06-11-2026 | 03:52pm

పురుషుల అండర్-19 ఆసియా కప్‌లో (Men's Under-19 Asia Cup) భారత యువ జట్టు విజయంతో టోర్నీని ప్రారంభించింది. నేపాల్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బౌలింగ్‌లో అదరగొట్టిన భారత కుర్రాళ్లు.. ఆ తర్వాత బ్యాటింగ్‌లోనూ (Batting) సత్తా చాటి ప్రత్యర్థికి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా లక్ష్యాన్ని ఛేదించారు.

టాస్ గెలిచిన భారత కెప్టెన్ లక్ష్య రాజ్‌చందాని తొలుత బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో బరిలోకి దిగిన నేపాల్ బ్యాటర్లను భారత బౌలర్లు కట్టుదిట్టమైన బౌలింగ్‌తో కట్టడి చేశారు. ఫలితంగా నేపాల్ జట్టు స్వల్ప స్కోరుకే పరిమితమైంది. దర్శ్ సోనార్ 43 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. భారత బౌలర్లలో ఇషాన్ సూద్, అర్జున్ రాజ్‌పుత్ చెరో మూడు వికెట్లు పడగొట్టగా, యశ్వీర్ గౌడ్ రెండు వికెట్లు సాధించాడు. అనంతరం భారత యువ జట్టు వికెట్ నష్టపోకుండా లక్ష్యాన్ని ఛేదించి విజయాన్ని ఖాతాలో వేసుకుంది.

మరిన్ని వార్తలు