ఎన్‌ఎస్‌ఎస్ శిబిరంలో నాలుగు కార్యక్రమాలు
తంగళ్ళపల్లి అక్టోబర్ 13 (విజయక్రాంతి ):రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం దేశాయిపల్లిలో బాబు జగ్జీవన్ రామ్ వ్యవసాయ కళాశాల(Babu Jagjivan Ram Agricultural College) ఎన్‌ఎస్‌ఎస్ యూనిట్ ఆధ్వర్యంలో అక్టోబర్ 13న రక్తదాన శిబిరం, ఆరోగ్య పరీక్షలు, క్షయవ్యాధిపై అవగాహన, సీపీఆర్ ప్రదర్శన నిర్వహించారు. రక్తదాన శిబిరంలో 21 మంది రక్తదానం చేశారు.
పీహెచ్‌సీ నేరెళ్ల వైద్య సిబ్బంది గ్రామస్థులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. వైద్యులు టీబీ నివారణ, చికిత్సతో పాటు అత్యవసర సమయాల్లో సీపీఆర్ ప్రాధాన్యతను వివరించారు. కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ రజియా సుల్తానా మార్గదర్శకత్వంలో నిర్వహించిన ఈ కార్యక్రమాల్లో ఎన్‌ఎస్‌ఎస్ వాలంటీర్లు చురుకుగా పాల్గొన్నారు.