ఇందిరమ్మ ఇండ్ల టవర్స్ నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్న మంత్రులు
13-10-2026 | 11:08pm
ఘట్ కేసర్, అక్టోబర్ 13 (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ హౌసింగ్ బోర్డు ఆధ్వర్యంలో మేడ్చల్ జిల్లా ఘట్‌కేసర్ సర్కిల్, పోచారం డివిజన్ పరిధిలోని అన్నోజీగూడ ఎల్ ఐ జి కాలనీ సమీపంలో బుధవారం ఉదయం 11 గంటలకు ఇందిరమ్మ ఇండ్ల టవర్స్(Indiramma Homes) నిర్మాణానికి అధికారులు శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించనున్నారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార, ప్రజా సంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి, మేడ్చల్ జిల్లా ఇన్‌చార్జి మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు హాజరై శంకుస్థాపన చేయనున్నారు.