సూరారంలో కుక్కల బెడద.. గ్రామస్తుల ఫిర్యాదు
13-10-2026 | 11:54pm
బాలానగర్: మండల పరిధిలోని సూరారం గ్రామంలోని 6వ వార్డులో వీధి కుక్కల బెడద(Stray Dog Menace)ను తగ్గించాలని గ్రామస్తులు మంగళవారం పంచాయతీ కార్యదర్శి రాంబాబుకు మంగళవారం ఫిర్యాదు చేశారు. వార్డు సభ్యురాలు శారదమ్మతో కలిసి గ్రామస్తులు సమస్యను వివరించారు. కుక్కల బెడదతో చిన్నపిల్లలు, వృద్ధులు బయటకు రావాలంటే భయపడుతున్నారని తెలిపారు. వీధి కుక్కల బెడదను నివారించేందుకు సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. చిన్నపిల్లలు, వృద్ధులు భయాందోళనలు లేకుండా సంచరించేలా గ్రామంలో సురక్షిత వాతావరణం కల్పించాలని విజ్ఞప్తి చేశారు.