ప్రమాద బాధితుడికి ఎల్ఓసి అందజేత
చెన్నూర్, (విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా(Mancherial District) చెన్నూరు మున్సిపాలిటీ పరిధిలోని 5వ వార్డుకు చెందిన రిజ్వాన్ కు వైద్య ఖర్చుల కోసం ప్రభుత్వం మంజూరు చేసిన ఎల్ఓసిని మంగళవారం కాంగ్రెస్ నాయకులు ఆయన కుటుంబ సభ్యులకు అందజేశారు. రిజ్వాన్ కు యాక్సిడెంట్ లో తలకు బలమైన గాయం కాగా చికిత్స కోసం హైద్రాబాద్ లో హాస్పిటల్ లో చేర్చించారు. చికిత్సకు పది లక్షల వరకు ఖర్చు అవుతుందని వైద్యులు చెప్పడంతో స్థానిక నాయకులకు పరిస్థితిని తెలిపారు.
వెంటనే మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామికి విషయం చెప్పగానే మంత్రి స్పందించి ఏడులక్షల యాబై వేల రూపాయలను మంజూరు చేయించారు. ఎల్ఓసిని(loc)ముఖ్యమంత్రి సహాయ నిధి పత్రంను ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వారికి కాంగ్రెస్ నాయకులు అందజేశారు. పేద కుటుంబానికి ప్రభుత్వ పరంగా సహాయం అందించి ఆదుకున్న మంత్రికి తమ కుటుంబ సభ్యులం రుణపడి ఉంటామని ధన్యవాదాలు తెలిపారు.