ఆరు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు
రాష్ట్రపతి భవన్ నుంచి కీలక ప్రకటన.. గవర్నర్ల బదిలీలు, కొత్త నియామకాలు
న్యూఢిల్లీ: దేశంలోని ఆరు రాష్ట్రాల్లో గవర్నర్ల నియామకాలు, బదిలీలకు సంబంధించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కీలక నిర్ణయం తీసుకున్నారు. సోమవారం విడుదలైన Rashtrapati Bhavan ప్రకటన ప్రకారం కేరళ, తమిళనాడు, కర్ణాటక, ఒడిశా, ఉత్తరాఖండ్, సిక్కిం రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను నియమించారు. ఈ మార్పుల్లో భాగంగా ఇద్దరు ప్రస్తుత గవర్నర్లకు మరో రాష్ట్ర బాధ్యతలు అప్పగించగా, మిగిలిన నాలుగు రాష్ట్రాలకు కొత్తవారిని నియమించారు.
ఆరు రాష్ట్రాలు.. కొత్త గవర్నర్ల పూర్తి జాబితా
తాజా Governor Appointments వివరాల ప్రకారం.. ఇప్పటివరకు సిక్కిం గవర్నర్‌గా ఉన్న ఓం ప్రకాశ్ మాథుర్‌ను కేరళ గవర్నర్‌గా నియమించారు. కేరళ గవర్నర్‌గా ఉన్న రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్‌కు తమిళనాడు బాధ్యతలు అప్పగించారు. ఇక కర్ణాటక గవర్నర్‌గా డాక్టర్ సుధా యాదవ్, ఒడిశా గవర్నర్‌గా బ్రజ్ మోహన్ రామ్, ఉత్తరాఖండ్ గవర్నర్‌గా డాక్టర్ ధల్ సింగ్ బిసెన్ నియమితులయ్యారు. ఓం ప్రకాశ్ మాథుర్ కేరళకు బదిలీ కావడంతో సిక్కిం గవర్నర్‌గా దుష్యంత్ గౌతమ్‌ను నియమిస్తూ రాష్ట్రపతి కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది.
బాధ్యతలు చేపట్టినప్పటి నుంచే అమల్లోకి ఈ Governor Reshuffleకు సంబంధించిన నియామకాలు, ఆయా వ్యక్తులు తమ రాష్ట్రాల్లో గవర్నర్లుగా బాధ్యతలు స్వీకరించిన తేదీ నుంచి అమల్లోకి వస్తాయని రాష్ట్రపతి కార్యాలయం స్పష్టం చేసింది. ఆరు రాష్ట్రాల్లో చోటుచేసుకున్న ఈ మార్పులతో కొత్త గవర్నర్లు త్వరలో తమ బాధ్యతలు చేపట్టనున్నారు.