హాస్టల్ టెండర్లపై హరీష్ రావు ఫైర్
హైదరాబాద్: తెలంగాణ హాస్టళ్ల(Telangana hostels)కు సరుకుల సరఫరా కోసం చేపట్టిన పీఎంయూ టెండర్లు(PMU Tenders)ను రద్దు చేయాలని BRS మాజీ మంత్రి హరీష్ రావు డిమాండ్ చేశారు. స్థానిక వ్యాపారులకు ప్రాధాన్యం ఇస్తూ స్థానిక విక్రేతల సరఫరా వ్యవస్థ(Local Vendor Supply System)ను తిరిగి అమలు చేయాలని కోరారు. పాఠశాల యూనిట్‌గా డిపీసీ ద్వారా స్థానిక టెండర్ ప్రక్రియ(Local Tender Process) నిర్వహిస్తే చిరు వ్యాపారులకు ఉపాధి అవకాశాలు పెరగడంతో పాటు విద్యార్థులకు నాణ్యమైన సరుకులు అందుతాయని ఆయన పేర్కొన్నారు.
కమిషన్ల కోసం బ్లాక్‌లిస్ట్ సంస్థకు టెండర్ కట్టబెట్టారంటూ హరీష్ రావు ఆరోపించారు. పాత విధానాన్ని పునరుద్ధరించకపోతే పెద్దఎత్తున పోరాటం చేస్తామని హెచ్చరించారు. ఈ వ్యాఖ్యలతో తెలంగాణలో హాస్టల్ సేకరణ విధానం(Hostel Procurement Policy), ప్రభుత్వ టెండర్ వివాదం(Government Tender Controversy) అంశాలు రాజకీయ చర్చకు తెరలేపాయి.