మాల్తుమ్మెద హార్టికల్చర్ భూమి లీజ్ నిమిత్తం పరిశీలన
13-10-2026 | 11:25pm
నాగిరెడ్డిపేట్, అక్టోబర్ 13 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్(Collector Ashish Sangwan) ఆదేశాల మేరకు ప్రభుత్వ ఉత్తర్వులను అనుసరించి మండలంలోని మాల్తుమ్మెద గ్రామ శివారులో గల ఉన్న ఆర్టికల్చర్ షీడ్ ఫామ్ భూమిలో ఆయిల్ ఫామ్ పంట సాగు చేయుటకు లీజ్ నిమిత్తం 40 ఎకరాల భూమిని పరిశీలించడం జరిగిందని సీడ్ ఫామ్ ఏఈఓ అజయ్ కుమార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో సీడ్ ఫామ్ డైరెక్టర్, తాసిల్దార్ వెంకట్ రెడ్డి, గిర్ధవర్,సర్వేయర్ గోపి తదితరులు పాల్గొన్నారు.