ఢిల్లీకి గుడ్‌బై.. హైదరాబాద్‌కు రేవంత్

13-10-2026 | 07:35pm

ఢిల్లీ పర్యటనకు ముగింపు.. హైదరాబాద్‌కు సీఎం రేవంత్ రెడ్డి!

హైదరాబాద్: ఢిల్లీలో మూడు రోజులుగా కొనసాగుతున్న తెలంగాణ కాంగ్రెస్ నేతల(Telangana Congress Leaders) పర్యటనకు ముగింపు పలికే దిశగా పరిణామాలు చోటుచేసుకున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) మంగళవారం రాత్రి హైదరాబాద్‌కు బయలుదేరనున్నారు. రాత్రి 8 గంటలకు ఢిల్లీ నుంచి ప్రయాణం ప్రారంభించనున్నట్లు సమాచారం.

ఇండియా కూటమి భేటీ తర్వాత గ్రీన్ సిగ్నల్

ఇండియా కూటమి సమావేశం అనంతరం సీఎం రేవంత్ రెడ్డి, ఇతర రాష్ట్ర కాంగ్రెస్ నేతలు హైదరాబాద్‌కు తిరిగి వచ్చేందుకు అనుమతి లభించినట్లు సమాచారం. పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్‌(PCC President Mahesh Kumar Goud)తో పాటు ఢిల్లీలో ఉన్న మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు కూడా తిరుగు ప్రయాణానికి సిద్ధమయ్యారు.

మూడు రోజులుగా ఢిల్లీలోనే నేతలు

ఇండియా కూటమి నిరసన(INDIA Alliance Meeting) కార్యక్రమాల నేపథ్యంలో ఢిల్లీకి చేరుకున్న తెలంగాణ కాంగ్రెస్(Telangana Congress) నేతలకు సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ కీలక సూచనలు చేశారు. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఢిల్లీని విడిచి వెళ్లవద్దని గతంలో సూచించారు. తాజా పరిణామాల నేపథ్యంలో నేతలు హైదరాబాద్‌కు తిరిగి వస్తుండటంతో రాష్ట్ర రాజకీయాల్లో ఈ అంశం చర్చనీయాంశంగా మారింది. సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్‌కు చేరుకున్న తర్వాత రాష్ట్రంలో పార్టీ కార్యక్రమాలు, ప్రభుత్వ వ్యవహారాలపై దృష్టి సారించనున్నారు.

మరిన్ని వార్తలు