Graduate MLC Elections: మంత్రులతో ఎమ్మెల్సీ అభ్యర్థి భేటీ
13-10-2026 | 03:33pm
హైదరాబాద్: తెలంగాణ రాజకీయాల్లో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల (Graduate MLC Elections) అంశం మరోసారి ప్రాధాన్యం సంతరించుకుంది. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి సామ రామ్మోహన్ రెడ్డి(Graduate MLC candidate Sama Rammohan Reddy) రాష్ట్ర మంత్రులు శ్రీధర్ బాబు, సీతక్కలను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సమావేశంలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు, గ్రాడ్యుయేట్ ఓటర్లకు సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. ఎన్నికల ప్రక్రియ, ఓటర్ల సమస్యలకు సంబంధించిన అంశాలు ఈ భేటీలో ప్రస్తావనకు వచ్చినట్లు సమాచారం.