కొలతలు పూర్తి చేయాల్సిందే.. సరైన వేతనం అందాల్సిందే!
రామారావుపేటలో ఫారెస్ట్ ట్రెంచెస్ పనులను పరిశీలించిన ఎంపీడీఓ శ్రీపతి బాపూరావు
జైపూర్, (విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం రామారావుపేట గ్రామపంచాయతీ పరిధిలో జరుగుతున్న ఫారెస్ట్ ట్రెంచెస్ పనులపై ఎంపీడీఓ శ్రీపతి బాపురావు(MPDO Sreepathi Bapurao) మంగళవారం క్షేత్రస్థాయిలో పరిశీలన చేపట్టారు. కూలీలకు రోజుకు రూ.308 వేతనం అందాలంటే నిర్దేశించిన కొలతలను అదే రోజు తప్పనిసరిగా పూర్తి చేయాలని స్పష్టం చేశారు.
పనుల్లో అలసత్వానికి తావివ్వకుండా నిర్దేశిత లక్ష్యాలను చేరుకోవాలని సూచించారు. ప్రతి ఇంటికి ఇంకుడు గుంత, ప్రతి ఊరికి ఊటకుంట, ప్రతి పంట పొలానికి పంటకుంట నిర్మించుకుని నీటి సంరక్షణకు బాటలు వేయాలని పిలుపునిచ్చారు. ఈ పరిశీలనలో ఏపీఓ, టీఏ, ఎఫ్ఏ, మేట్లతో పాటు కూలీలు పాల్గొన్నారు.