టికెట్లు ఫేక్.. దుబాయ్ జర్నీ బ్రేక్

13-10-2026 | 01:13pm

హైదరాబాద్‌: శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో నకిలీ విమాన టికెట్ల (Fake Flight Tickets) వ్యవహారం కలకలం రేపింది. దుబాయ్‌ వెళ్లేందుకు విమానాశ్రయానికి వచ్చిన ముగ్గురు ప్రయాణికుల వద్ద నకిలీ టికెట్లు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. దీంతో వారిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. తమకు టికెట్లు ఇచ్చిన ఏజెంట్‌ మోసం చేశాడని ప్రయాణికులు చెబుతున్నట్లు సమాచారం. విమాన ప్రయాణం కోసం టికెట్లు తీసుకున్నప్పటికీ, అవి నకిలీవని తెలియడంతో వారు ఇబ్బందుల్లో పడ్డారు.

ఈ వ్యవహారంపై పోలీసులు (Police Investigation) దర్యాప్తు ప్రారంభించారు. ముగ్గురు ప్రయాణికులను విచారిస్తున్న పోలీసులు, నకిలీ టికెట్లు (Fake Tickets) జారీ చేసిన ఏజెంట్‌ వివరాలను సేకరిస్తున్నారు. ప్రయాణికులను ఏజెంట్‌ ఉద్దేశపూర్వకంగా మోసం చేశాడా? ఈ వ్యవహారంలో మరెవరైనా ఉన్నారా? అనే కోణాల్లో దర్యాప్తు కొనసాగుతోంది. నిందితుడిగా భావిస్తున్న ఏజెంట్‌ను గుర్తించి పట్టుకునేందుకు పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.


మరిన్ని వార్తలు