నేటి ఎథిక్స్ కమిటీ సమావేశం వాయిదా
13-10-2026 | 08:49am
హైదరాబాద్: ఎథిక్స్ కమిటీ సమావేశం (Ethics Committee Meeting) వాయిదా పడింది. కమిటీ సభ్యులు ప్రస్తుతం ఢిల్లీలో ఉండటంతో నేడు జరగాల్సిన సమావేశాన్ని వాయిదా వేసినట్లు తెలిసింది. ఈ నెల 16న ఎథిక్స్ కమిటీ (Ethics Committee) మరోసారి సమావేశం కానుంది. ఈ భేటీలో ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి అంశంపై (Kaushik Reddy Issue) చర్చించి, తదుపరి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. కౌశిక్‌రెడ్డి వ్యవహారంపై కమిటీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్న అంశంపై ఆసక్తి నెలకొంది. ఈ నెల 16న జరిగే సమావేశంలో ఈ అంశంపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది