ఘనంగా దుర్గామాత కుంకుమార్చన
13-10-2026 | 11:02pm
మేడిపల్లి, అక్టోబర్ 13 (విజయక్రాంతి): బోడుప్పల్ సర్కిల్(Boduppal Circle) పరిధిలోని పర్వతాపూర్ సిపిఆర్ఐ రోడ్డు లక్ష్మీనగర్ కాలనీలోని శ్రీ విజయ దుర్గామాత మండపంలో మంగళవారం భక్తిశ్రద్ధలతో సామూహిక కుంకుమార్చన పూజా కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు, కుంకుమార్చనలు, పూజా కార్యక్రమాల అనంతరం భక్తుల కోసం మహా అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ అన్నదాన కార్యక్రమానికి ముదిగొండ సరిత-రమేష్ దంపతులు దాతలుగా వ్యవహరించి సంపూర్ణ సహకారం అందించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, స్థానిక కాలనీ వాసులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.