రిజర్వేషన్ల లెక్కలు..స్థానిక సమరానికి రంగం సిద్ధం

13-10-2026 | 09:17am

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ (Local Body Elections) వేగం పుంజుకుంది. ఎంపీటీసీ, జడ్పీటీసీ, ఎంపీపీ స్థానాలకు సంబంధించిన రిజర్వేషన్ల ఖరారుపై అధికారులు కసరత్తు చేస్తున్నారు. నేటి సాయంత్రంలోగా పరిషత్ స్థానాల రిజర్వేషన్లు ఖరారయ్యే అవకాశం ఉంది. జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ల స్థానాలకు సంబంధించిన రిజర్వేషన్లను కూడా నేడు ఖరారు చేసే అవకాశముంది. మరోవైపు, సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలకు సంబంధించిన రిజర్వేషన్ల ప్రక్రియను రేపటిలోగా పూర్తి చేయాలని అధికారులకు సూచించినట్లు తెలుస్తోంది.

మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి (Municipal Elections) రేపు షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉందని సమాచారం. అలాగే, ఈ నెల 19న పరిషత్ ఎన్నికల నోటిఫికేషన్ (Election Notification) విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది.రిజర్వేషన్ల లెక్కింపులో గతంలో అనుసరించిన విధానానికి కొన్ని సవరణలు చేసినట్లు సమాచారం. రిజర్వేషన్ల ఖరారు పూర్తయితే స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు మార్గం సుగమం కానుంది. దీంతో రాష్ట్రంలో ఎన్నికల సందడి మరింత పెరిగే అవకాశముంది.

మరిన్ని వార్తలు