రూ. 1,00,001 పలికిన వినాయకుని లడ్డు

25-09-2026 | 08:51pm

ఘట్ కేసర్, సెప్టెంబర్ 25 (విజయక్రాంతి) : ఘట్ కేసర్ పట్టణం ఈడబ్ల్యూఎస్ కాలనీలోని స్వామి వివేకానంద యువజన సంఘం (Swami Vivekananda Youth Association) ఆధ్వర్యంలో ప్రతిష్ఠించిన శ్రీ వినాయక స్వామి వారి లడ్డూ ప్రసాదం వేలంపాటలో స్థానికుడు శివరాత్రి సురేష్  రూ. 1,00,001 లకు కైవసం చేసుకున్నారు. ఈసందర్భంగా సురేష్ కి, వారి కుటుంబ సభ్యులకు స్వామి వివేకానంద యువజన సంఘం తరపున హృదయపూర్వక ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేశారు. వినాయకుని ఆశీస్సులు మీ కుటుంబంపై ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.

మరిన్ని వార్తలు